ఏఐసీసీ డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరైయ్యారు. పలు కీలక అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో AICC కీలక సమావేశాలు నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, విధానాలు, రాజకీయ నిర్ణయాలు రూపొందించడంలో డ్రాఫ్టింగ్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. కాగా, 15 మంది సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీని AICC ప్రకటించిన విషయం తెలిసిందే.