మంత్రి కొండ సురేఖ మురళీధర్ దంపతుల ఏకైక పుత్రిక కొండ సుస్మిత పటేల్ జన్మదిన సందర్భంగా బుధవారం వరంగల్ పోచం మైదాన్ జంక్షన్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పదిమందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.