దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకులు, అధికారులతో కలిసి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని "శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవం"కు ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు కూడా ఆహ్వానం పలికారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవం పోస్టర్‌ను ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు విడుదల చేశారు.