ఇప్పటివరకు 400 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగిందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు ఆదివారం తెలిపారు. వరంగల్లోని ఓ సిటీలో నెక్ చైర్ పర్సన్ అనురాధ దేశాయ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో 100 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 400 మంది చిరు వ్యాపారులకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని ఒక్కొక్క దాని విలువ సుమారు 60 వేల రూపాయల ఉంటుంది.