రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించింది. భూపాలపల్లి జిల్లాలో అర్హులైన ప్రతివారు అప్లై చేసుకోవాలని బీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కడపాక రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.