నిర్దేశిత ఉపాధి హామీ పనులను మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం వేలేరు మండలంలోని పీచరలో రూ. 2. 80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రైతుల పంట కుంట, రూ. 84 వేలతో నిర్మిస్తున్న పాడి పశువుల షెడ్ ను పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఎంతమంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారనే వివరాలను తెలుసుకున్నారు.