మహాబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు మూలస్తంభంతండాలో దారుణం జరిగింది. బుధవారం రాజమ్మ( వదిన) పై రమేష్ మరిది కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజమ్మ ను మహబూబాబాద్ ఏరియా హాస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటి స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో దాడి చేసినట్లు సమాచారం ఉంది. ఈ ఘటన పై కేసు నమెదు చేసి దర్యప్తు చేస్తున్నమని పోలీసులు తెలిపారు.