హనుమమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల ప్రకారం తేదీ 27 నాడు జరుగు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్, రెస్టారెంట్లు, కల్లు దుకాణములు, కల్లు డిపోలు తేదీ 25 రోజున సాయంత్రం 4 గంటల నుండి 27 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయబడునని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడునని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.