ఫిలింనగర్‌లో సినీ కార్మికుడి అనుమానాస్పద మృతి

79பார்த்தது
ఫిలింనగర్‌లో సినీ కార్మికుడి అనుమానాస్పద మృతి
TG: అనుమానాస్పద స్థితిలో సినీ కార్మికుడు మృతి చెందిన ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా పనివెల్లి గ్రామానికి చెందిన హుస్సేన్‌ (55), ఇందిరమ్మ దంపతులు కుమార్తెతో కలిసి ఫిలింనగర్‌లోని మాగంటి కాలనీలో నివాసముంటున్నారు. హుస్సేన్‌ ఇంటికెళ్తూ.. సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లాడు. అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி