హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలో ఉద్యాన పంట సాగులో భాగంగా రూ. 2. 60 లక్షల వ్యయంతో ఎకరం విస్తీర్ణంలో అత్యధిక(335) మామిడి మొక్కలు నాటిన తోటను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం సందర్శించి వాటిని గురించిన వివరాలను తెలుసుకున్నారు. మల్లికుదుర్లలో రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని పరిశీలించి వాటి పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.