ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆప్ తీవ్ర విమర్శలు చేసింది. సీఎం అసెంబ్లీలో చర్చ సమయంలో నిద్రిస్తున్నట్లు ఉన్న వీడియోను షేర్ చేసి ‘వీరు ఢిల్లీని ముందుకు తీసుకెళ్తారా?’ అని రాసుకొచ్చింది. ‘ఢిల్లీ బాగోగులు చూడటానికి ప్రజలు ఆమెను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. ఆమె నిద్రపోతున్నారు’ అని మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.