ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యానముద్రలో ఉండగా అక్కడికి వచ్చిన పార్వతీదేవి సరదాగా వెనుక నుంచి ఆయన రెండు కళ్లు మూసింది. పరమేశ్వరుని నేత్రాలు సూర్యచంద్రులు. పార్వతిమాత కనులు మూయడంతో లోకమంతటా చీకటి ఆవరించింది. అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడోనేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగుతో నింపాడు. ఇది ఈశ్వరుడి త్రినేత్రం వెనకున్న కథ.