బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా 18 నుండి 21 వరకు అడ్వెంచర్ ఆక్టివిటీస్ ఖిలవరంగల్ లోని ఏకశిలా పార్కులో జిల్లాలోనే ధర్మసాగర్, వేలేరు, అయినవోలు, ఆత్మకుర్, శాయంపేట, హసన్పర్తి నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. శుక్రవారం ముగింపు కార్యక్రమ వేడుకలలో డీఈఓ వాసంతి హాజరై విద్యార్థుల ఉద్దేశించి పదవ తరగతి అవగానే చదువు ఆపకుండా పై చదువులు కొనసాగించాలని, ధైర్య సాహసాలతో లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.