వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ
సిద్దిపేటలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. సిద్దిపేట కమిషనర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబి, వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఇరువర్గాలు ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పారు. వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.