నేరం చేయకపోయినా పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికా కోర్టు 419 కోట్లను నష్టపరిహారంగా అందజేసింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్ అనే వ్యక్తిని 2008లో దోషిగా నిర్దారిస్తూ 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే అతని తప్పులేదని తెలిసింది. అయితే ఇన్నేళ్ల పాటు అన్యాయంగా శిక్ష అనుభవించినందుకు 50 మిలియన్ డాలర్ల( 419 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.