బ్రిటన్ పోలీస్ శాఖ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి డేమ్ డయనా జాన్సన్ పర్సనల్ బ్యాగు చోరీకి గురైంది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల కాన్ఫరెన్సులోనే ఈ ఘటన జరగడం గమనార్హం. రద్దీతో సతమతమవుతున్న జైళ్ల నుంచి కొంతమంది ఖైదీలను విడుదల చేసిన రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో అక్కడి పోలీసుల తీరు, భద్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.