ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రోత్సహించడంలో భాగంగా కొత్తగా తీసుకొచ్చిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద విద్యుత్ బైక్ కొనుగోలుదారులకు గరిష్ఠంగా రూ.10వేలు సబ్సిడీ లభించనుంది. రెండో ఏడాది ఆ మొత్తం రూ.5 వేలకు పరిమితం కానుందని కేంద్రం తెలిపింది. ఫేమ్ స్థానంలో రూ.14,335 కోట్లతో 2 పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందులో పీఎం ఇ-డ్రైవ్ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించారు.