సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి పురస్కరించుకొని ఆదివారం సిద్దిపేటలో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి హరీశ్ రావు పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. సర్దార్ పాపన్న పోరాట స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఆయన జయంతిని పండగల జరుపుకోవడం జరుగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించామన్నారు.