బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అదనపు ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రాయదుర్గం పీఎస్లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.132, 351 (3) BNS యాక్ట్ ప్రకారం ఎమ్మెల్యేపై కేసు ఫైల్ చేశారు.