18 ఏళ్ల వయసు నిండిన భారత పౌరులు ఎవరైనా ముద్రా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యవసాయేతర కార్యకలాపాలైన తయారీ, శుద్ధి, వ్యాపారం, సేవా రంగం వంటి ఉపాధి సృష్టించే ప్రణాళిక ఉన్న వారు ఎవరైనా ముద్రా రుణాలకు అర్హులే. దరఖాస్తుదారు ఏ బ్యాంకులోనయినా డిఫాల్టర్ అయి ఉండకూడదు. రుణాల చెల్లింపు చరిత్ర బాగుండాలి. ముద్రా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారం లేదా పరిశ్రమ రంగంలో దరఖాస్తుదారుకు నైపుణ్యం, అనుభవం ఉండాలి.