కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ ఏకంగా ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. టెస్టు క్రికెట్లో వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 18 బంతుల్లోనే 50 పరుగులు, 10.1 ఓవర్లలోనే 100 పరుగులు, 18.2 ఓవర్లలోనే 150, 24.4 ఓవర్లలోనే 200, 30.4 ఓవర్లలోనే 250 పరుగులు చేసి సరికొత్త రికార్డులను భారత్ తన ఖాతాలో వేసుకుంది.