బాలాపూర్: దుర్గాదేవి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు
బాలాపూర్ లో విజయ దుర్గా నగర్ కాలనీలో ఉన్న విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు కనులపండుగా జరిగాయి. భక్తులకు అమ్మవారు వివిద రూపాలలో దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకారం, పూజలు భక్తి శ్రద్దాలతో ఆలయ ప్రధాన అర్చకులు జనార్ధన శర్మ నిర్వహించారని ఆలయ కమిటీ ట్రెజరర్ కామరాజు హరి ప్రసాద్ తెలిపారు. నవరాత్రులలో దాదాపుగా 2700 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపామన్నారు.