పహాడీ షరీఫ్: ఆటో డ్రైవర్ అదృశ్యం
ఆటోడ్రైవర్ అదృశ్యమైన సంఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జల్పల్లి గ్రామానికి చెందిన షేక్ అలీం కుమారుడు షేక్ మోసిన్ ఆటోడ్రైవర్. ఇతనికి నాలుగు నెలల క్రితం సనా అనే యువతితో వివాహమైంది. అప్పటి నుంచి భార్యతో పాటు అత్తింటి వారితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మోసిన్ కు అతని సోదరుడు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసిన్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.