ఏపీలోని అల్లూరి జిల్లాలో వంజంగి మేఘాల కొండలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. కొండల చాటున పాల సంద్రంలా ఉన్న మేఘాలను చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు. చలికాలం ప్రారంభం కావడంతో ఏజెన్సీ వ్యాప్తంగా దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఈ క్రమంలో వంజంగి కొండ పై నుంచి మేఘాల అందాలు కనువిందు చేస్తున్నాయి.