దసరా వేడుకల్లో అపశృతి

72பார்த்தது
దసరా వేడుకల్లో అపశృతి
ఏపీలోని కడప, కోనసీమ జిల్లాల్లో శనివారం దసరా వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కడపలోని బెల్లంబండి వీధిలో దసరా ఊరేగింపులో పందిరి పై భాగానికి విద్యుత్ తీగలు తగిలాయి. దాంతో విద్యుత్ షాక్‌ కొట్టి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మరోవైపు కోనసీమ జిల్లా అమలాపురం మండలం కొంకాపల్లిలో వినయ్ అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

தொடர்புடைய செய்தி