మీర్ పేట్ లోని మిథిలానగర్, సత్యసాయి నగర్ లో స్థానిక కాలనీవాసులు జలదిగ్బంధంలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో వరద నీటి కోసం వేసిన పైప్ లైన్లు మూసుకుపోయి వరద మొత్తం ఇళ్ల మధ్యలో వచ్చి చేరింది. గత సంవత్సరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎన్నో కోట్లు వెచ్చించి ఎస్ఎన్టిపి నాలా పనులు చేపట్టినప్పటికీ పైప్ లైన్ పనులు ఎటువంటి ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సమస్య వచ్చి పడింది.