100 కి.మీ. మేర పాక్షికంగా దెబ్బతిన్న రోడ్లు
సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు 381.55 కి.మీ.రహదారులు పూర్తిగా, సుమారు 100 కి.మీ. మేర పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు నివేదిక రూపొందించారు. మరో 23 కల్వర్టులు కూలిపోయినట్లు గుర్తించారు. వీటి మరమ్మతులకు తక్షణం రూ.100 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదించారు.