వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ రేస్ క్లబ్, ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లను విరాళంగా అందజేసింది. రేస్ క్లబ్ డైరెక్టర్, లోక్సభ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి , మరో డైరెక్టర్ నర్సింహారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి లను కలిసి ఈ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రేస్ క్లబ్ వారిని అభినందించారు.