
చండూరు: రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను శనివారం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీకి కనెక్ట్ అయ్యే వివిధ గ్రామాల లింకు రోడ్లను 60 ఫీట్ల వెడల్పు చేసే ఆలోచన ఉందని, దానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.