హైదరాబాద్ నగరంలో మెట్రోరైలును విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రెండో దశలో 161.4 కిలోమీటర్ల మార్గం చేపట్టాలని నిర్ణయించింది. రెండో దశలో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్ల మార్గంలో 24 స్టేషన్లను గుర్తించింది. తాజాగా వాటికి సంబంధించిన వివరాలను మెట్రో 'X' వేదికగా వెల్లడించింది.