మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల పాత్రలను పోషించారు. అనంతరం అత్యుత్తమ బోధన గావించిన విద్యార్థి ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లచ్చిరాం మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులన్నారు.