నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన బీజేపీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కేపీఆర్ మెమోరియల్ జూనియర్ కళాశాల, వినూత్న జూనియర్ కళాశాల అధ్యాపకులకు కరపత్రాలు అందించారు. బీజేపీ జిల్లా నాయకులు నీరజ, కొండల్, బూత్ అధ్యక్షుడు కరుణ్, తదితరులు పాల్గొన్నారు.