నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతి 4వ శనివారం నిర్వహించే నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని విద్యార్థుల సంప్రదాయ నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించారు. పాఠశాల పీడీ గిరిబాబు మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం వల్ల విద్యార్థులలో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెంపొందడంతో పాటు ఆత్మన్యూన్యతాభావం తొలగిపోయి చదువుల యందు గొప్పగా రాణించే అవకాశం ఉందని అన్నారు.