మర్రిగూడ మండలంలో సరంపేట గ్రామంలో శ్రీ శ్రీ సప్తగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రథానికి పచ్చటి తోరణాలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి దేవత మూర్తుల విగ్రహాలను ప్రతిష్టించి డోలు వాయిద్యాలతో రథాన్ని భక్తులు తాళ్లతో పైకి కిందికి లాగి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.