అనుముల మండలం కొత్తపల్లి గ్రామకి చెందిన మాజీ మార్కెట్ డైరెక్టర్ ఊడ్తురి శ్రీనివాస్ రెడ్డి తండ్రి ఊడ్తూరి రాంరెడ్డి శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. నల్లగొండ జిల్లా శాసన మండలి సభ్యులు యంసి కోటిరెడ్డి శనివారం వారి నివాసంలో పార్ధీవ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. రాంరెడ్డి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.