మర్రిగూడ మండలం కుదబక్షపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పందుల పాండు గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేయడం జరిగింది. పండు మాట్లాడుతూ పదవ తరగతిలో 10/10 తెచ్చుకున్న విద్యార్థులకు 10,000 రూపాయల బహుమతిని అందజేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రామతులసి, తదితరులు పాల్గొన్నారు.