చౌటుప్పల్ మండలం మసీదు గూడెంలో ప్రజాపాలన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇస్తున్నామన్నారు