నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని పీకే మల్లేపల్లి గ్రామ పరిధిలోని శ్రీ హజరత్ అబ్బాస్ దర్గా షరీఫ్ ఉరుసు ఘనంగా ప్రారంభమయ్యింది. ఇందులో బాగంగా శుక్రవారం రాత్రి 11 గంటలకు గ్రామంలోని దర్గా ముతవల్లి ఇంటి నుంచి గంధం ఒంటె పై బయలు దేరి ఊరేగింపుతో దర్గా వద్దకు తెల్లవారుజామున 5 గంటలకు చేరుకుంటుంది.