ఇంటిగ్రేటెడ్ స్కూల్ పాఠశాల కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో వల్లూరు క్రాంతి గురువారం స్థల పరిశీలన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆందోలు నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో మొదటి విడత ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో పాఠశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.