హెజ్బొల్లా టాప్ మిలటరీ కమాండర్ మృతి?

60பார்த்தது
హెజ్బొల్లా టాప్ మిలటరీ కమాండర్ మృతి?
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ప్రతీకార దాడులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం కురిపించింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ సైన్యం కూడా ప్రతీకార దాడులకు పూనుకుంది. ఈ క్రమంలో దక్షిణ బీరుట్ లో జరిపిన లక్షిత దాడుల్లో హెజ్బొల్లా సైనిక ఉన్నతాధికారుల్లో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. దీన్ని లెబనాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.

தொடர்புடைய செய்தி