సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక వినాయక చవితి: అదనపు కలెక్టర్
సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక గణపతి నవరాత్రి ఉత్సవాలు అని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నంబట్టి వాడలో గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లు జరగకుండా నిర్వహించుకోవాలన్నారు.