స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలో శనివారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సఫాయి మిత్ర సురక్ష శివార్ కింద మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇతర కార్మికులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆరోగ్య రక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేణు, కమిషనర్ సతీష్, డిఎంహెచ్ఓ డా. హరీష్ రాజ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. అనిత, రెవిన్యూ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.