పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరాహార దీక్షకు సీనియర్ డాక్టర్లు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్జీ కర్లోని 50 మంది సీనియర్ డాక్టర్లు, బోధనా సిబ్బంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వారు రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.