హైదరాబాద్ లో ఈ నెల 9న జరిగే తెలంగాణ ప్రజా ఫ్రంట్ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని టీపీఎఫ్ జిల్లా కన్వీనర్ టి. జైపాల్ సింగ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాలలోని అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దానిని ప్రజాస్వామికరించే క్రమంలో ప్రజా ఫ్రంట్ ముఖ్యపాత్ర పోషించిందని తెలిపారు.