బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా మంచిర్యాల సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ. లక్ష కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలు, నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.