నిరుపేదలకు వైద్యం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
నిరుపేదలకు వైద్యం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్షేట్టిపేట మండలం ఉత్తుకూరు గ్రామానికి చెందిన అశ్విని కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ఎల్ వోసీని ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదల పాలిట వరమని ఆయన స్పష్టం చేశారు.