డిప్యూటీ డిఎంహెచ్ఓ ని సస్పెండ్ చేయాలని వినతిపత్రం
వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కి సహకరిస్తున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారికి శనివారం సిపిఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రవేట్ ఆస్పత్రుల తనిఖీలా పేరుతో సదరు అధికారి పైసలు వసులు దందా చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రులు పైసలు ఇస్తే చర్యలు ఉండవా అని ప్రశ్నించారు.