ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. చిన్న వివాదం కారణంగా ఓ మహిళ నడిరోడ్డులో ఆర్పీఎఫ్ లేడీ కానిస్టేబుల్‌తో ఘర్షణకు దిగింది. దీంతో వారిద్దరూ ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ గొడవలో లేడీ కానిస్టేబుల్ యూనిఫాం చిరిగిపోయింది. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ నుంచి కానిస్టేబుల్‌ను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.