ప్రతి రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉండి కడుపులో మంట తగ్గుతుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చికాకుని తొలగిస్తుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారాలు తీసుకున్న తర్వాత మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు గుండెను కూడా ఆరోగ్యంగా చేస్తాయి. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు నుండి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.