

చెన్నారావుపేట: మొక్కజొన్న కంకులతో ఇళ్లు
వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన రైతు పున్నం నరసయ్య తన మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించాడు. మంచి దిగుబడి రావడంతో కంపెనీ ప్రతినిధులు ఇలా మొక్కజొన్న కంకులతో అందంగా ఆకర్షణీయంగా ఓ గూడు నిర్మించారు. ఆ గూడు చుట్టూ కంకులతో ఫెన్సింగ్ ను అందంగా ముస్తాబు చేశారు. మొక్కజొన్న కంకులతో చేసిన ఈ గూడును చూసేందుకు రెండు కళ్లు చాలట్లేదనిపిస్తుంది.